బడ్జెట్ అంటే... సబ్బుల ధరలు తగ్గాయి... టూత్ బ్రష్ ధర పెరిగింది...
బడ్జెట్ అంటే...
సబ్బుల ధరలు తగ్గాయి... టూత్ బ్రష్ ధర పెరిగింది...
కండోమ్ లు ఉచిత పంపిణీకి కేటాయింపులు లేవు....
లుంగీల దారం పైన...లంగాల బొందుల పైన సుంకం పెంపు...
వంటివి చదవడానికి వినడానికి బాగా అలవాటుపడ్డ ప్రాణాలకు ఇలాంటి బడ్జెట్ స్పీచ్ లు ఎందుకు నచ్చుతాయి....?!
అర్థరాత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టి .. ప్రొద్దున కల్లా పక్క సర్దుకునే శోభనాన్ని వదలడం దగ్గరనుంచి...
ఏప్రిల్ ఒకటిన ప్రజలను ఫూల్ చేసే... పుక్కట్ ప్రాకారాల నుంచీ...
అన్ని వలస వాద పైత్యాలనూ వదిలించుకున్న జాతీయ వాద ప్రభుత్వ బడ్జెట్ అంటే...కొంచెం చప్పగానే ఉంటుంది మరి....
ఉపాధి హామీకి బడ్జెట్ ఎందుకు తగ్గింది...వలలు కొరికే ఎలుకలు తగ్గాయి కాబట్టి...
మైనారిటీ కేటాయింపులు ఎందుకు తగ్గాయి...అసలు సంగతులు తెలుస్తున్నాయి కాబట్టి...నిజమైన లబ్ధిదారులకు నిధులు పోతున్నాయి కాబట్టి...
రోడ్డు గుంతలున్నా పర్లేదు...నడుం విరిగితే ఉచిత వైద్యం ఇస్తే చాలు అనుకునే వారికి... మంచి రోడ్లు వెయ్యడం ఏం అర్థం అవుతుంది...
వాలంటీర్ ఉద్యోగాలే ..ఉద్యోగాలు అనుకునే వారికి...
స్కిల్ సెంటర్లు పెట్టీ..నిపుణులను చేస్తాం అంటే ఏం అర్థం అవుతుంది....
మౌలిక వసతులకు లక్షల కోట్లు ఇస్తే...అదంతా బోల్డంత ఉపాధి సృష్టిస్తుంది అనే అవగాహన లేనివారికి...బడ్జెట్ గురించి చెప్పి ఏం లాభం...
డిఫెన్స్ కీ.. రైల్వే లకి కేటాయింపులు పెంచితే..ఎందుకో అర్థం కాని వారి గురించి ఏం ఆలోచిస్తాం...
అరుదైన గిరిజన జాతులకు డబ్బు కేటాయిస్తేనూ...
విశ్వకర్మ వంటి పథకాలతో...చేతి వృత్తులకు ఊతం ఇస్తేనూ...మనసు తృప్తి పడక పోతే ఏం చేస్తాం...
పేదలకు ఇళ్ల నిర్మాణానికి డబుల్ కేటాయింపు చిన్న విషయం కాదు కదా...
ఇంకో సంవత్సరం ఎనభై కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఉచితం మామూలు మాటలా...
5G కి... ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి డబ్బులు ఇవ్వడం... పాన్ నంబర్ తో మొత్తం వ్యాపార లావాదేవీల అనుసంధానం జనాలకు నచ్చేవి కావు అనుకోవడం తెలివి తక్కువ...
డిజిటల్ పేమెంట్స్ కి ఎంత సులభంగా అలవాటు పడ్డారో..దీనికీ అంతే వేగంగా సెట్ అవుతారు...
డ్రోన్లు ..శాటిలైట్ లు ఉపయోగించి నువ్వు పండించే పంట ఎంత... ఏ పంట వేశావూ...రైస్ మిల్లుల్లో దాచుకున్న రీసైక్లింగ్ ఎంత...అన్నీ తెలిసిపోతే...ఎవడికి తడుస్తుందో తెలియనంత అమాయకులు కాదు కదా ప్రజలు...
వచ్చే రోజుల్లో దొంగలు అందరూ డిజిటల్ లాకర్లో తెలిసిపోతారు... లాకప్పుల్లో చేరిపోతారు...
ప్రస్తుతం బొక్కలు పూడ్చే పని అయ్యింది...
ప్రపంచం మొత్తం ఆర్థికంగా పడుకుంటే..మనమే కదా లేచి నిలబడి నడుస్తున్నం...
మరో టర్మ్ అధికారంలోకి వచ్చాకా... వందే భారత్ అని
ఇప్పుడు ఏడ్చే వాళ్ల చేత కూడా అనిపించడం ఖాయం...
బడ్జెట్ లొసుగులు గురించి... కార్పొరేట్లుకు దేశాన్ని దోచి పెట్టడం గురించి తెలుగు ఛానెల్స్ మూకుమ్మడిగా కుమ్మేస్తున్నాయి...మనం ఎందుకు చెప్పడం...
చెత్త డబ్బాలు రెడీ ఉన్నవాళ్లు నింపేసుకోండి...
జై హింద్!
🙏🙏🙏🙏
కేశబోయినాశ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ
Comments
Post a Comment