నూతనంగా నియమితులైన బిజెపి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్,
నూతనంగా నియమితులైన బిజెపి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, సెక్రటరీలు, విప్ లు, అధికార ప్రతినిధులు, ఆఫీస్ ఇంచార్జ్, కోశాధికారులకు శుభాభినందనలు తెలియజేశారు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు గారు. అందులో భాగంగా నల్లకుంట కార్పొరేటర్ అమృత గారు కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా గౌతమ్ రావు గారు బిజెపి నగర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ రావు గారు మాట్లాడుతూ నిరంతరం భారతీయ జనతా పార్టీ పటిష్టం కోసం అమృత గారు చేసే కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అని,అందులో భాగంగానే వారి సేవను గుర్తించి జి. హెచ్. ఎమ్. సి. కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, కార్పోరేటర్లు పద్మ వెంకట్ రెడ్డి,ఉమా రమేష్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment