మౌలిక సదుపాయాల కల్పన అంటే ఉపాధికల్పననే

మౌలిక సదుపాయాల కల్పన అంటే ఉపాధికల్పననే
´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´
.             మనదేశానికి ఎటువంటి కరెన్సీనోట్ల ముద్రణ యంత్రం కొంటున్నామో, అటువంటి యంత్రమే పాకిస్తాన్ కొనడానికి అవసరమైన సదుపాయాలు  సమకూర్చి , తద్వారా నకిలీ నోట్లు పాకిస్తాన్ అచ్చువేసి మనదేశంలో చలామణి చేయడానికి సహకరించిన  కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరో మీకు తెలుసా?  

             తన భార్య పేరుతో రిజిష్టర్ అయిన ఇంట్లో ఉంటూ, దానిని అద్దెఇల్లుగా పేర్కొని నెలనెలా లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి చెల్లింపజేసిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా? 

               ముంబై దగ్గర విదేశీ టెక్నాలజీతో నిర్మించబూనిన విద్యుదుత్పాదక కేంద్రం నష్టదాయకంగా ఉందని, భారం కాబోతున్నదని గ్రహించి ఆ కాంట్రాక్టును రద్దు చేయగా ఆ బహుళజాతీయ సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయింది. సమర్థుడైన మన న్యాయవాది స్థానంలో ఒక పాకిస్థానీ ప్లీడరును పెద్ద ఫీజుతో నియమించి, కేసు ఓడిపోయి చాలా పెద్ద ఎత్తున డేమేజీలు చెల్లించిన కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా?

            ఆయన లీలలు చెప్పడానికి ఆరంభిస్తే ఒక పట్టాన తేలవు. ఆయన నిర్మలమ్మగారి బజెట్ పై చెప్పిన మాటలు నవ్వు పుట్టిస్తున్నవి. పేదరికము, ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఆర్థిక అసమానతలు- అనే మాటలే నిర్మలగారి ఉపన్యాసంలో వినబడ లేదట. 

                ఉపన్యాసాల్లో పదేపదే పలికినంతమాత్రాన ఆ సమస్యలను పరిష్కరించ బూనుకొన్నట్లేనా? ఎప్పుడూలేని విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు 10లక్షల కోట్ల రూపాయలను కేటాయించినది ఉపాధికల్పనకు అవకాశమివ్వటం కాదా? నైపుణ్యాల వృద్ధికై శిక్షణ ఇవ్వటం ఉపాధి కల్పనకు కాదా? ఉపాధి అంటే కూర్చోబెట్టి సాకడం కాదు, ఒక నిర్మాణాత్మక పని చేయించి జీతమివ్వడం.

          ధరలను క్రిందికి దించే రాజమార్గంగాని, చిట్కాగాని ఆయనవద్ద ఉంటే చర్చకు రమ్మనండి. ఈ మాజీ ఆర్థికమంత్రి (హార్వార్డ్ రిటర్నుడు) శాస్త్ర పరిజ్ఞానం లోని డొల్లతనం బట్టబయలౌతుంది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!