కొన్ని చిత్రాలు ఎంతటి తప్పడు సంకేతాలు ఇస్తాయో గమనించండి..
కొన్ని చిత్రాలు ఎంతటి తప్పడు సంకేతాలు ఇస్తాయో గమనించండి..
ఐదేళ్ల క్రితం నేను తిరుమల వెళ్లినప్పుడు కొండపైన బస్టాండ్‌తో పాటు క్యూలైన్లలో భక్తులందరికీ వేడి వేడి పాలు ఉచితంగా ఇవ్వడం చూసి చాలా సంతోషం కలిగించింది. చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది.. దురదృష్టవశాత్తు కరోనా తర్వాత దీన్ని నిలిపివేసినట్లున్నారు. అలాగే ఉచిత అల్పాహార పంపిణీ కూడా అంతగా కనిపించడం లేదు..
తాజా వివాదానికి వద్దాం..
సీఎం జగన్ శివరాత్రికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు సందేశం విడుదల చేస్తే సరిపోయేది. కానీ ఆ పార్టీ శ్రేణులు అత్యుత్సాహంతో విడుదల చేయడం చిత్రం విమర్శలకు దారి తీసింది.
ఆలయం మెట్ల మీద పాలు వృధాగా పారుతుంటే, సీఎం జగన్ ఓ పాపకు పాలు తాగిస్తున్నాడు. అంతే కాదు. సీఎం గారికి కనీసం బొట్టు కూడా లేదు. శైవాలయంలో నందికి వైష్ణవ సాంప్రదాయ నిలువు బొట్టు, బాలికకు అడ్డం బొట్లు కనిపిస్తున్నాయి.
నాకు తెలిసి ఏ ఆలయంలోనూ పాలను వృధాగా పారబోయరు. అభిషేకానికి ఉపయోగించిన పాలను భక్తులందరికీ ఉచితంగా తీర్థం రూపంలో పంపిణి చేస్తారు.. జాగ్రత్తగా గమనిస్తే కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా హిందూమతాన్ని కించపరుస్తూ ఈ చిత్రం క్రియేట్ చేశారనిపిస్తోంది. దీని వల్ల వారి శాడిస్టు ఆత్మలు శాంతించి ఉండొచ్చు. కానీ వైసీపీకి, సీఎంకి చెడ్డపేరు వస్తున్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. కనీసం క్షమాపణ, ఖండన ఇచ్చినా హుందా ఉండేది.
Comments
Post a Comment