వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని దేవనూరు ఘటనలో శివస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపడం నీచమైన చర్య*
*శివస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపడం నీచమైన చర్య* వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని దేవనూరు ఘటనలో చాలామంది శివస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపడం నీచమైన చర్య. పవిత్రమైన శివమాలలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చి, పూర్తి స్థాయిలో విచారించాల్సిన అధికారులు కేవలం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్లకు గురై హిందూ ధర్మ విశ్వాసాలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం దుర్మార్గం. హిందూ ధర్మాన్ని అణిచివేయాలన్న కుట్రలో భాగంగానే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శివస్వాములను జైలుకు పంపారు. అయ్యప్ప మాల వేసుకునే రోహిత్ రెడ్డి, అయ్యప్ప స్వామి పుట్టుకపై ఒక నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కనీసం స్పందించలేదు. ఇప్పుడు మాలాధారణ లో ఉన్న శివస్వాములను ఏకంగా జైలు కు పంపడం చూస్తుంటే హిందు వ్యతిరేఖ విధానం స్పష్టంగా అర్థం అవుతుంది. మాలలో ఉండగానే అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు సాములతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళి గౌడ్ గారిని కూడా అరెస్టు చేయడం జరిగింది. హిందువులను టార్గెట్ చేస్తూ, తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని యావత్ హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. అవసరమైతే అధికారులపై ప్రయివేట్ కంప్లైంట్ వేయడానికి వెనకడుగు వేసేది లేదు. అందుకే హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా సిద్ధమవుదాం. కేశబోయినాశ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ
Comments
Post a Comment