అసైన్డ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి అనేది పెద్ద నిజం పచ్చి నిజం హద్దులు లేవు అనే ఒకే ఒక కారణం చేత
అసైన్డ్ భూములు కబ్జాలకు గురి అవుతున్నాయి ఏ విధంగా అంటేదానికి కారణం ఒకే ఒక్కటి అసైన్డ్ భూములకు హద్దులు ఉండవు దీన్ని బేస్ చేసుకుని చాలామంది రాజకీయ నాయకులు భూస్వాములు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను పేదల నుండి లాక్కొని కబ్జా చేస్తున్నారు ఎందుకంటే ఒక పట్టా భూమి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగితే మాత్రమే ఆ భూమికి హద్దులు వస్తాయి అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ కావు అందువలన వాటికి హద్దులు ఉండవు ఎన్నో సంవత్సరాలుగా కబ్జాలో ఉంటున్న వారిని బెదిరించి మీ భూమి ఇక్కడ లేదు వేరే దగ్గర ఉంది ఇక్కడే ఉంటే మీ హద్దులు చూపించండి అని బెదిరించి వారి దగ్గర నుండి ఆ భూములను కబ్జాలోకి వెళ్తున్నారు అలాంటప్పుడు ఆ పేదలు పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ సిఐ హోదాఉన్న వారు కూడా మీ హద్దులను చూపించండి మీ భూమి ఎక్కడ ఉందో చూపించండి అని వాళ్ళు కబ్జాలో ఉన్నారు మీరు వెళ్లకూడదు అని అంటున్నారు కోర్టులకు వెళితే కూడా జడ్జీలు ఇలాంటి కేసులను మీకు హద్దులు లేవు అని డిస్మిస్ చేస్తున్నారు ఒక అసైన్డ్ భూమి ఉన్న పేదవాడు అతనికి హద్దులు ప్రభుత్వం నుండి ఎమ్మార్వో ఆఫీసు నుండి ఇవ్వనప్పుడు దాన్ని ఎలా ప్రూఫ్ చేసుకోగలడు ఈ ఒక్క కారణాన్ని ఈ ఒక్క రసగుని ఆసరాగా చేసుకుని భూస్వాములు రాజకీయ నాయకులు పేదల నుండి భూములను లాక్కుంటున్నారు పేదలు ఏమీ చెయ్యలేని పరిస్థితులలోఆ భూములను వదిలేస్తున్నారు. అవతలి వారి రాజకీయ రౌడీ పలుకుబడి కారణంగా కూడా భయపడి వదిలేస్తున్నారు
అసైన్డ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి అనేది పెద్ద నిజం పచ్చి నిజం హద్దులు లేవు అనే ఒకే ఒక కారణం చేత
కేశబోయినాశ్రీధర్
హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ
Comments
Post a Comment