ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. స్నేహంలో ఇచ్పిపుచ్చుకోవడాలు ఉండాలి..

A friend in need is a friend indeed.. ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. స్నేహంలో ఇచ్పిపుచ్చుకోవడాలు ఉండాలి.. 
పాకిస్తాన్‌ ఒకప్పుడు మతం ఆధారంగా ఇస్లామిక్‌ దేశాలను కలుపుకొనిపోయి భారత్‌కు వ్యతిరేకంగా వారి మద్దతు తీసుకునే ప్రయత్నం చేసేది.. కాలక్రమంలో ఆ దేశాలకు భారత్‌ ప్రాధాన్యత అర్థమైంది.. పాకిస్తాన్‌ ఎప్పుడు జోలె పట్టి అడుక్కోవడం తప్పు తోటి ఇస్లామిక్‌ దేశాలకు ఏనాడు సాయపడింది లేదు. ఆ దేశం అవసరం కూడా వారికి లేదు.. కానీ ఒక ప్రజాస్వామ్య దేశంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారణంగా సౌదీ, ఎమిరేట్స్‌ తదితర గల్ఫ్‌ దేశాలు భారత్‌కు దగ్గరయ్యాయి.  పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ దేశాలు పట్టించుకోకుంగా భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. 
అదే సమయంలో టర్కీ, మలేషియా దేశాలు పాకిస్తాన్‌కు నేరుగా మద్దతు ఇస్తూ భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. బాహటంగా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి మనకు చికాకు కలిగించాయి. భారత్‌ వ్యూహాత్మకంగా మలేసియా నుంచి పామోలిన్‌ దిగుమతులను తగ్గించేసరికి, ఆ దేశం కాస్త దారికి వచ్చింది.
తాజాగా టర్కీ భూకంపంలో దారుణంగా దెబ్బతిన్నది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. సానుభూతి తెలపండంతో పాటు మానవతావాద మద్తును ప్రకటించారు. టర్కీకి ఎన్డీఆర్‌ఎఫ్‌, వైద్య బృందాలను, సహాయ సామాగ్రిని పంపారు. 
టర్కీకి ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌ ఏం సాయం అందించిందో తెలియదు.. కానీ భారత్‌ స్పందించిన తీరు టర్కీని కదిలించింది.. ఢిల్లీలోని  టర్కీ రాయబారి ఫిరత్‌ సునెల్‌  కృతజ్ఞతలు తెలుపుతూ..  'దోస్త్‌ కారా గుండె బెల్లి ఒలూర్‌ (ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు)' అంటూ ట్వీట్‌ చేశారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!