#మోడీ_దేశాభివృద్ధి #అభివృద్ధి
#మోడీ_దేశాభివృద్ధి #అభివృద్ధి
ఆసియాలోనే అతి పెద్ద హెలికాప్టర్ నిర్మాణ పరిశ్రమ:
భారత రక్షణ/వాయురంగంలో #మేక్_ఇన్_ఇండియా #ఆత్మనిర్భర భారత్ లో భాగంగా మోడీ కర్ణాటక రాష్ట్రంలో తుముకూర్ వద్ద ఆసియాలోనే అతి పెద్ద హెలికాప్టర్ నిర్మాణ పరిశ్రమకు 2016లో శంఖుస్థాపన చేశారు.
దీనిని భారత ప్రభుత్వ రంగ సంస్థ HAL సంస్థ నిర్మించింది. దీని నిర్మాణం పూర్తి అయి ఈ రోజు మోడీ దీనికి ప్రారంభోత్సవం జరపబోతున్నారు.
ఈ పరిశ్రమలో మొదటిగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్ (LUH) తయారు చేస్తారు. ఈ LUH అనేది పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన 3-టన్నుల తరగతి, సింగిల్-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ హెలికాప్టర్, దీనికి పలు విధాలుగా నడిపే అవకాశాలు గల ప్రత్యేకత ఉంది.
లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) మరియు ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (IMRH) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి వాటి మరమ్మతుల కోసం, అలాగే భవిష్యత్తులో LCH, LUH, Civil ALH మరియు IMRH మరమ్మతుల కోసం ఈ ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో సివిల్ LUHలను ఇక్కడ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే అవకాశం కూడా ఫ్యాక్టరీకి ఉంది.
ఈ పరిశ్రమ భారతదేశం యొక్క హెలికాప్టర్ల పూర్తి అవసరాలను స్వదేశీ పద్ధతిలో తీర్చడానికి వీలు కల్పిస్తుంది మరియు భారతదేశంలో హెలికాప్టర్ రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీలో స్వయం ప్రతిపత్తిని సాధిస్తుంది.
దీనిని అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. హెలి-రన్‌వే, ఫ్లైట్ హ్యాంగర్, ఫైనల్ అసెంబ్లీ హ్యాంగర్, స్ట్రక్చర్ అసెంబ్లీ హ్యాంగర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు వివిధ సపోర్టింగ్ సర్వీస్ సదుపాయాలు వంటి సౌకర్యాల ఏర్పాటుతో, ఫ్యాక్టరీ నిర్మాణం అన్ని విధాలా పూర్తి అయింది.
ఇది 6000 మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తుంది.
ఇన్ని పెద్ద ప్రోజెక్టు ల ప్రారంభోత్సవ సంబరాలు చూస్తూ ఉంటే , బహుశా ఇన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టు లకు తానే శంఖుస్థాపన చేసి తానే ప్రారంభోత్సవం జరిపిన మొదటి ప్రధాని గా మోడీ దేశ చరిత్రలో నిలిచిపోతారు ఏమో?
Comments
Post a Comment