వసుదైక కుటుంబం.. అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావన.. భారత విదేశాంగ శాఖ ఇప్పుడు

వసుదైక కుటుంబం.. అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావన.. భారత విదేశాంగ శాఖ ఇప్పుడు 'వసుదైక కుటుంబం' ట్యాగ్‌లైన్‌ చేసుకుంది అంటే అతిశయోక్తి లేదు. భారత దౌత్య విధానం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.. ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో బహుళజాతి ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుందామని ఆరాటపడుతుంటే, చాలా పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ పంపి ఉదారతను చాటుకుంది. నేపాల్‌లో భూకంపం వచ్చిప్పుడు వెంటనే స్పందించింది. ఇప్పుడు టర్కీ విషయంలోనే ఇదే విధంగా ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. భారత్ పంపిన సహాయక, వైద్య బృందాలు అక్కడ చురుగ్గా పని చేస్తున్నాయి.
కష్టాల్లో ఉన్న టర్కీని ఆదుకునే విషయంలో ముస్లిం దేశాలు ముందుకు రాకముందే భారత్‌ ఎందుకు స్పందించింది.. టర్కీ మన శత్రుదేశం మద్దతుదారు పాకిస్తాన్‌ మద్దుతుదారు కాబట్టి మనం వారిని ఆదుకోవడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇందుకు సమాధానం గత పోస్టులో ఇచ్చే ప్రయత్నం చేశాను అది కూడా చదవండి.. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత..
#Turkey #India #NDRF








Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!