హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారు

హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారు. ప్రజల మీద దాడులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారు. నిన్న మా మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ మా నేతలు, కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని వెళ్లి విపరీతంగా కొడుతున్నారు.  
ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు. అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి. పోలీసులు అధికారపక్షం తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవలసిన అవసరం ఏంది ? కొట్టడం ఏంటి? డీజీపీ గారు చట్టం పనిచేస్తుందా ? లేదా ? 
మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్,తుమ్మ శోభన్ లని వెంటనే విడుదల చేయాలి.

- ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హుజూరాబాద్.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!