. ఎమ్మెల్యేల ఎర కేసును CBI కి అప్పగించడం . అధికార పార్టీ గొంతులో పచ్చివెలక్కాయ

.    ఎమ్మెల్యేల ఎర కేసును CBI కి అప్పగించడం
.       అధికార పార్టీ గొంతులో పచ్చివెలక్కాయ 
´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´``´´´´´´`````````````´´´´´´
     .         "ఎమ్మెల్యేల ఎరకేసు/Poach gate" కేసును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ""SIT" నుండి CBI కి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది మొదలు పాపం రాష్ట్ర ప్రభుత్వం తెగ గత్తర గత్తర... బిత్తర బిత్తర అవుతున్నది...

.            హైకోర్టు సింగల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించగానే, సదరు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వెళ్తామని అప్పటి వరకు "స్టే" ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థను డివిజన్ బెంచ్ అదే రోజూ తోసి పుచ్చినప్పటికీ, మళ్ళీ నిన్నా ఇవ్వాళ్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తమ అప్పీలు స్వీకరించేవరకు సింగిల్ జడ్జి  & డివిజన్ బెంచ్ ల ముందు మళ్ళీ మళ్ళీ అదే అదే అభ్యర్థనను చేస్తూనే, ఇక మరోవైపు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకు సదరు ఫైల్లు ఇవ్వాలని CBI ఎంత కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం CBI కి ఆఁ ఫైల్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడం గమనార్హం. పైగా  హైకోర్టు ఉత్తర్వుల్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని CBI ఫైల్లు అడిగితే, దాన్ని CBI ది "అత్యుత్సాహం" అని రాష్ట్ర ప్రభుత్వం సూత్రీకరిస్తుండడం చూస్తుంటే, ఆఁ ఫైల్లల్లో తమ గు(జు)ట్టేదో CBI కి చిక్కుతున్నదనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం తెగ హైరానా... హంగామా... పడుతున్నదనే అనుమానం ధ్రువపడుతున్నది. 

.        అయితే CBI ది "అత్యుత్సాహం" అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరి తమ "తాత్సరం"కు మరియు "సంశయం"కు కారణమేంటో ?! 

              ఇక CBI కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోది కనుక అనుమానమైతే, మరి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని "SIT" పై మాత్రం ఎందుకు అనుమానపడకూడదు !!?? అదే సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది కదా !

... అంటే దాల్ మే కుచ్ కాలా హై !!
అందుకే అంత భయం... భయం...
భేచిన్... భేచిన్...
                      కేశబోయినాశ్రీధర్
             హైదరాబాద్ సెంట్రల్ బిజెపి
          ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!