భారత భద్రతా చరిత్ర: నీరవతనం నుండి ప్రతిఘటన వరకు
చరిత్ర గతిని, మనుష్యుల స్వభావాలనూ
గ్రహించుకొన్న వారు రాగల పరిణామాలను అంచనా వేసుకొని అవసరమైన సంసిద్ధతతో ఉంటారు. తక్కువ నష్టంతో పెనుప్రమాదాలను ఎదుర్కొంటారు. ఆపై మరెన్నో ప్రమాదాలను రాకముందే నివారిస్తారు.
1947 నుండి1998 వరకూ ముందుజాగ్రత్తలు గాని,
గట్టి నివారణ చర్యలు గాని లేకుండా ఎప్పటి కప్పుడు నెట్టివేసుకొంటూ కాలయాపన చేసే పాలన సాగుతూ వచ్చింది.
1998-2004 లో మధ్య ప్రమాదాలు, దాడులూ జరుగుతూ వచ్చాయి, వాటికి దీటుగా స్పందించ నారంభించటమే గాక, లొంగుబాటు ఉండబోదనే సంకేతాలు బలంగా పంపబడినవి.
2004-14 మధ్య జరిగిన దాడులకు ప్రతిచర్య వ్యక్తమయ్యేదికాదు. మన ప్రభుత్వపు మెతకదనం బహిర్గతమైన రోజులవి. దీనికి ప్రజలు ఎంతగా విసిగి పోయారంటే, పాలక కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెసు బలం 2014 ఎన్నికల్లో ఐదవ వంతుకు (216 నుండి 44కి) దిగజారిపోయింది.
2014 లో అధికారానికి వచ్చిన బిజేపి ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ ,భద్రతా రంగాలలో ప్రతిఘటనా సామర్థ్యాన్ని నిర్మించే ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పుడు శత్రువులు గతంలో వలె చీటీకి మాటీకీ వచ్చి మీద పడటంలేదు.
మరీ దురద ఎక్కువై వచ్చిన సందర్భాల్లో చాలా గట్టిగా మరిచిపోలేని విధంగా పాఠం చెప్పబడుతున్నది.
2002లో జరిగిన గోధ్రా ఘటన, తదనంతర పరిణామాలపై తీసుకొన్న చర్యల ఫలితంగా గుజరాత్ అంతకు ముందెన్నడూ లేని రీతిలో ప్రశాంతతను అనుభవంలో చూడగల్గుతున్నది. అలాగే 2014 తర్వాత భారతదేశం అంతటా ప్రశాంతత అనుభవంలోకీ వస్తున్నది.
మణిపూర్ లో, కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్లో , జమ్ము కాశ్మీర్ లో అప్పుడప్పుడూ ప్రశాంతత భంగమౌతున్నది ఒక వాస్తవం. అనతికాలంలో అక్కడా పరిస్థితులు దారికి తీసుకొని రాబడగలవు.
Comments
Post a Comment