“ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదంపై భారత్ విజయం, అంతర్గత శత్రువులపై ఆందోళన”

రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా, దేశం విషయానికి వస్తే అందరూ పార్టీలకు, సిద్దాంతాలకు అతీతంగా ఏకతాటిపై ఉండాలి..

కొందరు సోకాల్డ్ మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారుల పేరిట తమ రాతలు, కూతలతో అదుపు తప్పుతూ దేశం పరువు తీస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం కన్నా ఇలాంటి అంతర్గత శత్రువులతోనే దేశానికి ఎక్కువ ప్రమాదకరం..

ఉగ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదంపై జరుగుతున్న యుద్ధం ఇది. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఎన్నో శిబిరాలు నాషనం చేసి, కీలక ఉగ్రవాదులను నిర్మూలించాం. పాకిస్తాన్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇస్లామిక్ దేశాలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి. మన దేశంలో మాత్రం ఈ అద్దె మెదళ్లు సొంద దేశానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నారు. దేశ నాయకత్వం, సైన్యం, అధికారులకు కించపరుస్తున్నారు.

పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ మీద దాడి చేయొద్దని సుద్దులు చెప్పారు. అక్కడ చనిపోయింది మన దేశ ప్రజలు అనే సోయి కూడా వీరికి లేదు దేశభక్తి కలిగి ఉండటం ఉన్మాదమట. వీరంతా ఫేక్ దేశ భక్తులట.. ఫేక్ నేషనలిమట..

భారత్‌ది యుద్ధోన్మాదం అన్నారు. సిందూ జలాలను ఆపొద్దన్నారు. పాకిస్తాన్‌లో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తినడానికి తిండిలేక బాధపడుతున్నారని, వారిపై కనికరం చూపాలని శత్రుదేశం మీద ప్రేమను ప్రదర్శించుకున్నారు.

ఆయుధాలు పట్టి ప్రజలపై యుద్దాలు చేసే ఉగ్రవాదులకన్నా ఈ మేథో తీవ్రవాదులే ప్రమాదకరం.. అసలు వారిని తయారు చేస్తున్నది కూడా వీరే..

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!