జ్యోతి మల్హోత్ర: దేశద్రోహం యొక్క చీకటి కథ - భారత్‌కు వెన్నుపోటు!
దేశం కోసం ధర్మం కోసం
హిందూ బందు మిత్రుల చైతన్యం కోసం అందరికీ పంపండి
*జ్యోతి మల్హోత్ర: ఒక దేశ ద్రోహపు కథ‼️*
దేశ సరిహద్దులు
కాగితాల మీద గీసిన గీతలు మాత్రమే కాదు, అవి కోట్లాది మంది గుండె చప్పుడు!
కానీ,
ఆ గుండె చప్పుడులోనే కొన్నిసార్లు ద్రోహం అనే విషబీజం నాటుకుంటుంది. సరిగ్గా అలాంటి విషాదకరమైన కథే ఇది.
భారతమాత ముద్దుబిడ్డల్లా కనిపించే కొందరు, తమ స్వార్థంతో దేశానికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడతారని ఎవరూ ఊహించలేరు. వాళ్ళని చూస్తే ‘అటు పాకిస్తాన్ కాదు, ఇటు ఇండియా కాదు’ అన్నట్టుగా ఉంటారు.
ఇండియాలో పుట్టి పెరిగి, ఇక్కడి గాలి పీల్చుకుంటూ, కడుపు నింపుకుంటూ, రహస్యంగా శత్రుదేశానికి సేవ చేస్తారు.
ఇలాంటి వాళ్ళలో ఒకరు జ్యోతి మల్హోత్ర!
👇👇
చూడటానికి సాధువులా, మాటలకు తియ్యగా ఉండేది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు. ‘ట్రావెల్ విత్ జో’ అంటూ ప్రపంచాన్ని చుట్టేసే వ్లాగర్‌గా అందరికీ తెలుసు. కానీ, ఆ అందమైన ముఖం వెనుక ఒక చీకటి కోణం దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు.
2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు వీసా కోసం వెళ్లినప్పుడే కథ మొదలైంది. అక్కడ ఏసానూర్ రెహ్మాన్ అలియాస్ దానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. బహుశా అది ప్రేమ ముసుగులో ఉన్న కుట్ర కావచ్చు.
దానిష్ ఆమెకు రెండుసార్లు పాకిస్తాన్ వీసా ఇప్పించాడు. పాకిస్తాన్‌లో అలీ ఎహసాన్ అనే వ్యక్తి జ్యోతికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ గూఢచారులు షకీర్, రాణ షేబాస్‌ను కలిసింది. వారి ఫోన్ నెంబర్లను రాణ అనే ఇండియన్ పేరుతో సేవ్ చేసుకుంది.
అప్పటినుండీ జ్యోతి,
ఐఎస్ఐ ఏజెంట్లతో నిత్యం టచ్‌లో ఉండేది. వాళ్ళు డబ్బులిచ్చి, కావలసిన రహస్య సమాచారాన్ని రాబట్టేవారు. ఒకసారి ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌ను కలిసింది.
ఒక సాధారణ ట్రావెల్ వ్లాగర్‌కు పాకిస్తాన్ ప్రధాని కుటుంబంతో ఏమి పని?
ఆ తర్వాత జ్యోతి కాశ్మీర్‌కు వెళ్ళింది. అక్కడ అమర్‌నాథ్, వైష్ణోదేవి ఆలయాలను సందర్శించింది. ఇండియన్ ఆర్మీ కదలికలను తన కెమెరాలో బంధించింది. ఆ ఫోటోలను, వీడియోలను పాకిస్తాన్‌కు చేరవేసింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి, పెహల్గామ్‌లో టూరిస్టులపై దాడి జరిగింది.
ఆ దాడికి కారణం జ్యోతి ఇచ్చిన సమాచారమేనని ఇప్పుడు అనుమానిస్తున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఇంతకుముందు కాశ్మీర్‌లో ఎక్కడో ఒకచోట దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు టూరిస్టులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.
రయాసిలో శివ భక్తులపై, పెహల్గామ్‌లో టూరిస్ట్ బస్సుపై దాడులు జరగడానికి కారణం, టూరిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం పాకిస్తాన్‌కు చేరవేయడమే. ట్రావెల్ వ్లాగర్ల ద్వారానే ఈ సమాచారం వారికి అందుతుంది.
జ్యోతిని వలలో వేసుకున్నారు. డబ్బు, సుఖం ఆశ చూపించారు. ఆమె మెదడును విషపూరితం చేశారు. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు.
ఆయుధాలతో యుద్ధం చేయడంలో మనం ముందున్నా, ఇలాంటి కుట్రలు చేయడంలో పాకిస్తాన్ దిట్ట.
జ్యోతి తన యూట్యూబ్ ఛానల్‌లో కాశ్మీర్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు పెట్టింది. ఇండియన్ ఆర్మీ కదలికలను కూడా రికార్డ్ చేసింది. కాశ్మీర్‌లో ఒక సాధారణ వ్యక్తి ఆర్మీకి సంబంధించిన ఫోటోలు తీస్తే అనుమానిస్తారు. కానీ, జ్యోతి అందంగా మాట్లాడుతూ వీడియోలు తీస్తుంటే ఎవరికీ అనుమానం రాలేదు. అందుకే ఆమెను స్లీపర్ సెల్‌లా ఉపయోగించుకున్నారు.
ఒకవేళ ఆమెను పట్టుకోకపోతే, రేపు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా తిరిగి, అక్కడి ముఖ్యమైన ప్రదేశాల సమాచారం శత్రువులకు చేరవేసేది. ఆమె పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో కూడా రహస్య సమాచారం చేరవేసిందని తెలుస్తోంది.
దానిష్‌తో కలిసి ఆమె ఇండోనేషియాకు కూడా వెళ్ళింది. ఒక వీడియోలో దానిష్ ఒక్క క్షణం కనిపించాడు. పాకిస్తాన్ హై కమిషన్‌లో పనిచేసే వ్యక్తితో ఒక ఇండియన్ వ్లాగర్ ప్రేమలో పడటం, కలిసి తిరగడం ఎంతవరకు సమంజసం? అతను నేరుగా పాకిస్తాన్ ఆర్మీకి, ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తి.
కపిల్ జైన్ అనే వ్యక్తి మే 2024లోనే ట్వీట్ చేస్తూ, జ్యోతిని నిఘాలో ఉంచమని ఎన్ఐఏను కోరాడు. ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన ఒక ఫంక్షన్‌లో పాల్గొన్న పది రోజులకే కాశ్మీర్‌కు వెళ్ళింది. ఆ ఎంబసీ ఫంక్షన్‌లో ఏం జరిగిందో, ఆమెకు ఎలాంటి ఆదేశాలు అందాయో విచారించాల్సి ఉంది.
ఆమె తన వీడియోల్లో పాకిస్తాన్ ఆర్మీని పొగిడింది, పాకిస్తాన్‌ను గొప్పగా చూపించింది. ఆపరేషన్ సిందూర్ మొదలవ్వకముందు ‘యుద్ధం వద్దు’ అంటూ పోస్టులు పెట్టింది. టర్కీని బైకాట్ చేసినప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడింది. ఇండియన్ ఆర్మీ గెలిచినప్పుడు బాధపడే వారిలో ఆమె ఒకరు.
చివరకు దానిష్‌ను పట్టుకోవడం ద్వారా జ్యోతి గుట్టు రట్టయింది. ఆమె వాట్సాప్ చాట్‌లు, మెసేజ్‌లు ఆమె ద్రోహాన్ని బయటపెట్టాయి. విచారణలో ఆమె తన తప్పును ఒప్పుకుంది. ఆమెతో పాటు మరో ఐదుగురు పాకిస్తాన్ గూఢచారులు కూడా పట్టుబడ్డారు.
ఆమె తన యూట్యూబ్ వీడియోల్లో మొదట హిందీలో మాట్లాడేది. కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ మార్చి ఇంగ్లీష్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోల్లో పాకిస్తాన్‌ను పొగుడుతూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వచ్చేది.
జ్యోతి ఒక్కతే కాదు, యారీ డాక్టర్ అనే మరో వ్లాగర్ కూడా చాలాసార్లు పాకిస్తాన్ వెళ్ళాడు. అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఏ బుట్టలో ఏ పాము ఉందో తెలియదు. అందరినీ ఒకేసారి విచారించి, నిజాలు బయటపెట్టాలి.
కొన్ని రోజుల క్రితం అజిత్ దోవల్ గారు చెప్పినట్టు,
మనం బ్రిటిషర్లతో ఓడిపోలేదు, బ్రిటిష్ ఆర్మీలో ఉన్న మనవాళ్ళే మనల్ని అణచివేశారు. జ్యోతి లాంటి వాళ్ళు దేశానికి చేసే ద్రోహం అలాంటిదే.
జ్యోతిని దానిష్ బంగ్లాదేశ్‌కు కూడా పంపాడు. అక్కడ కూడా ఆమె బంగ్లాదేశ్‌ను పొగుడుతూ వీడియోలు చేసింది. కానీ, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ట్రాఫిక్, దొంగతనాలు అక్కడ సాధారణం. అయినా, ఈ వ్లాగర్లు మాత్రం అబద్ధాలు చెబుతూ ఇండియాను తక్కువ చేసి చూపిస్తారు.
అజ్మల్ కసబ్‌ను విడుదల చేయాలని జాలి చూపిన వాళ్ళు, ఇప్పుడు జ్యోతి చేసిన ద్రోహానికి ఏం సమాధానం చెబుతారు?
"కొన్ని డబ్బుల కోసం, కొంత సుఖం కోసం, పాక్ అబ్బాయి ప్రేమ కోసం, ఐదు నిమిషాల పడక సుఖం కోసం ఈమె మొత్తం దేశాన్ని అమ్మేసింది!
డబ్బు కోసం భారత ఆర్మీ రహస్య సమాచారం లీక్ చేయడం లేదు. ఈ అమ్మాయి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చనిపోయిన 27 మంది హిందూ అన్నదమ్ముల చావుకు కారణమైంది!"
ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎవరితో పోరాడాలి?
పాకిస్తాన్ ఆర్మీతోనా? చైనా ఆర్మీతోనా?
కాశ్మీర్‌లోని ఉగ్రవాదులతోనా? లేక ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి గూఢచర్యం చేసే జ్యోతి లాంటి వాళ్ళతోనా?
ఇలాంటి
వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.
జై హింద్!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Comments
Post a Comment