భవిష్యత్తు ఎంత దూరంలో? భారత్-పాకిస్తాన్ ఘర్షణ పరిణామాలు

ఇప్పటివరకు జరిగిందేమిటి?

పాకిస్తాన్ పహల్గామ్ లో ఒక దుర్మార్గానికిపాల్పడి మానవాళికి సవాలు విసిరింది. దీనికిభారతదేశం స్పందించి పాకిస్థాన్ ప్రభుత్వానికి తన స్థానమేమిటో చూపిస్తున్నది.

ఉభయదేశాలూ అణ్వస్త్రాలు కల్గిన దేశాలు కావటంతో మిగిలిన దేశాలు వారుకూడా ఏమైపోతుందో నని భయపడిపోతున్నారు.

ఒక 48 గంటలపాటు యుద్ధం ఆపి, మీరెందుకు యుద్ధంచేస్తున్నారో, ఏమీకావాలనుకొంటున్నారో పరస్పరం తెలియజేసుకొని ఒక అవగాహన కు వచ్చే ప్రయత్నం చేయండి అని అమెరికా ప్రభుత్వం అడిగింది.

యుద్ధం కొనసాగితే జరుగబోయేది ఏమిటో సంబంధితులకు తెలిసి వచ్చింది గనుక ఉభయదేశాల వారు తమలోతాము (ఎవరికి వారు) తర్కించుకొని వివిధరకాల ప్రత్యామ్నాయలను ఆలోచించుకొని వస్తారు. ఏవిషయాలలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ఉండాలో, ఏ విషయాల్లో రాజీ లేకుండా ఉండాలో వారి మనస్సుల్లో ఉంటుంది. ముఖాముఖీ మాట్లాడుకొనే సమయంలోనే అవి అవతలివారికి తెలియజేయబడుతాయి.‌

చివరికి ఏదైనా అంగీకారం కుదిరితే ఉభయపక్షాల వారు కలిసి మీడియాకు వెల్లడిస్తారు. అంగీకారం కుదర లేదనుకోండి.. మళ్లీ బలాబలాలను ప్రదర్శించుకోవటం, ప్రత్యర్థిని లొంగదీసుకొనే ప్రయత్నం కొనసాగించటం సాగిపోతుంది.

కొద్ది గంటలు యుద్ధ విరామం పాటించండి అని ప్రపంచ దేశాల తరఫున లేదా ప్రపంచంలోని ఒక పెద్ద దేశం తరఫున ఒక అభ్యర్థన వచ్చినపుడు మన ప్రభుత్వం ఏమిచేయాలి అని మీరు అనుకొంటున్నారు? అజార్ మసూద్ నో, దావూద్ ఇబ్రహీంనో కాళ్లూ చేతులూ కట్టివేసి డిల్లీలో ప్రధానమంత్రి లేదా, రక్షణమంత్రి లేదా విదేశాంగ మంత్రి కాళ్లదగ్గర పడవేసి, యుద్ధం ఆపండి మహాప్రభో అని కాళ్లు పట్టుకొనే దృశ్యం కొందరు చూడాలనుకొంటున్నారు. వాళ్ల ఆశ నెరవేరే అవకాశం చాలా తక్కువ. అటువంటిది జరిగినా, నాలుగుగోడల మధ్య జరుగుతాయేగాని, టీవీ కెమెరాల ముందు జరుగవు.

పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్ముకాశ్మీర్ ని సమర్పించు కొంటున్నాం అని పాకిస్థాన్ చెప్పిన తర్వాతనే కాల్పులు విరమణకు అంగీకరించ వలసిందని కొందరు సెలవిస్తు న్నారు. అటువంటి ప్రతిపాదనతో పాకిస్తాన్ వస్తే, భారత ప్రభుత్వం సంతృప్తి చెంది యుద్ధం విరమణకు అంగీక రిస్తుందని మీరు అనుకొంటున్నారా? పాకిస్తాన్ ముందు లేవనెత్తి సాధించవలసిన విషయాలు ఇంకేమీ లేవా?

మీ పరిధిలో లేని విషయాలను ఎందుకు బహిరంగంగా లేవనెత్తి, "భారతదేశంలో ఎన్నో గొంతులు వినిపిస్తున్నాయి, అందరూ ఏకైక సంకల్పంతో లేరు" ఆనుకొనేందుకు ఎందుకు ఆస్కార మిస్తున్నారు?

ఇప్పుడు మన మున్న స్థితిలో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలచటం లేదు.

యుద్ధం ఎవరు చేయాలో వారే చేస్తారు. చర్చల్లో, సంప్రదింపులలో ఎవరు పాల్గొనాలో వారే పాల్గొంటారు. వారి మాటలకు ఉండే విలువ కాలక్షేపం కబుర్లకు పరిమితమయ్యే వారి మాటలకు ఉండదు.

తొందరపడి ఏదిబడితే అదిమాట్లాడి సానుకూల మౌతున్న పరిస్థితిని రసాభాస చేయకండి.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!