అంబర్‌పేట సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైలైట్స్: మోడీ హయాంలో తెలంగాణ రహదారుల అభివృద్ధి విజయగాథ! #KishanReddy #AmberpetFlyover #TelanganaDevelopment #NationalHighways #ModiGovernment #HyderabadInfra #BJPLeadership #InfrastructureGrowth

అంబర్పేట్ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సభలో మాట్లాడిన ముఖ్యంశాలు

ఈరోజు మన దేశంలో ఎక్కడికెళ్లినా, మన తెలంగాణలో ఏ జిల్లాలోకి వెళ్లినా, స్పష్టంగా కనబడేది – జాతీయ రహదారుల అభివృద్ధి. ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నితిన్ గడ్కరీ గారి కృషితో సాధ్యమైంది.

2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో కేవలం 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులే ఉండగా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వల్ల అది 5,000 కిలోమీటర్లకు పైగా పెరిగింది. ఇది రహదారుల విస్తరణలో ఒక రికార్డే.

రోడ్లు ఉంటే రైతులకు వ్యయనష్టం తగ్గుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కనెక్టివిటీ పెరగడం వలన సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మౌలిక వసతుల విషయంలో రహదారుల పాత్ర ఎంతో కీలకం.

గత పదేళ్లలో మోడీ పాలనలో జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు అన్నీ అభివృద్ధి చెందాయి.

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా చెప్పాలంటే — బాంబే హైవే ఫ్లైఓవర్, ఆరంఘార్ ఫ్లైఓవర్, అంబర్ పేట్ ఫ్లైఓవర్ వంటి మల్టీలెవెల్ ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం.

నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో అంబర్ పేట్ ఫ్లైఓవర్ కోసం ఎంతో కష్టపడి సాధించాం. ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డుల కోసం 6 చోట్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని ఈ భూసేకరణను పూర్తిచేయాలని కోరుతున్నాం.

ఇక అంబర్ పేట్ ప్రాంతంలో 21 ప్రభుత్వ పాఠశాలలు, 100కి పైగా కమ్యూనిటీ హాలులు నిర్మించాం.

ఎన్టీఆర్ గారి హయాంలో రోడ్డు విస్తరణలు మొదలైనప్పటికీ, కొన్ని స్థానిక ఇబ్బందుల వల్ల అవి నిలిచిపోయాయి. అంబర్ పేట్ ఫ్లైఓవర్‌కి సంబంధించి రెండు ప్లేసుల్లో స్టీల్ బ్రిడ్జిల రూపంలో పరిష్కారం కనుగొన్నాం.

ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎన్నో సమస్యలు ఎదురైనా, ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!