ప్రకాష్ రాజ్‌కు కేశబోయిన శ్రీధర్ స్ట్రాంగ్ రిప్లై: ‘అబిర్ గులాల్’ నిషేధంపై దేశ భద్రత కోణం! #PrakashRaj #AbirGulaal #FawadKhan #NationalSecurity #BJPResponse #TelanganaBJP #PahalgamAttack #FreedomOfExpression #IndianCinema
ప్రకాష్ రాజ్ గారికి సూటిగా జవాబు
పాకిస్తాన్‌లో రూపొందిన ‘అబిర్ గులాల్’ అనే సినిమాను భారత్‌లో నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాష్ రాజ్ గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా దేశ భద్రతను తక్కువగా భావించే ధోరణికి నిదర్శనం. ఈ సినిమా హీరో ఫవాద్ ఖాన్, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నేపథ్యంతో వచ్చిన సినిమాల్లో నటించడమే కాకుండా, గతంలో భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన చరిత్ర కలిగి ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి నటించిన సినిమాను భారత ప్రజలు తిరస్కరించడం సహజం.
పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి దాడి తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే పాపం కండా కళాకారులను కొందరు “సాహిత్య స్వేచ్ఛ”, “కళా స్వేచ్ఛ” పేర్లతో సమర్థించడం దురదృష్టకరం.
ప్రకాష్ రాజ్ గారు “ఫోర్న్ సినిమాలు తప్ప దేనిని నిషేధించకూడదు” అంటున్నారు. దేశానికి, జవాన్లకు వ్యతిరేకంగా రూపొందిన సినిమాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండమంటారా? దేశభక్తిని తిట్టడం, దేశద్రోహాన్ని సమర్థించడం ఏ స్వేచ్ఛా కాదు.
ఈ దేశ భద్రత మాకెందరికైనా మించి. దేశాన్ని తిడితేనే అభిప్రాయం అంటారా? అలాంటి సినిమాలకు, వ్యక్తులకు భారత్‌లో స్థానం లేదు.
– కేశబోయిన శ్రీధర్
జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ OBC మోర్చా

Comments
Post a Comment