ఆపరేషన్ సిందూర్ విజయం vs పాకిస్తాన్ ఫేక్ ప్రాపగండా
1948లో నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయకుండా మొండికేయడంతో భారత సైన్యం 'ఆపరేషన్ పోలో' ప్రారంభించింది. సంస్థానాన్ని చుట్టుముట్టిన భారత సైన్యాన్ని ఎదుర్కొని ఓడిస్తున్నామని దక్కన్ రేడియో, నిజాం అనుకూల పత్రికలు ప్రచారం చేశాయి. వాస్తవానికి చాలా చోట్ల హైదరాబాద్ సైనికులు, రజాకార్లు తోకముడిచి పారిపోయారు. నిజాం లొంగుబాటు ప్రకటనతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
1939-45 రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత హిట్లర్ సమాచార మంత్రి గోబెల్స్ ఇలాంటి తప్పుడు ప్రచారంలో దిట్ట. చివరి నిమిషం వరకూ జర్మనీ సైన్యం విజయపరంపరతో దూసుకెళ్లుతోందని రేడియో ప్రకటనలతో ఊదరడొట్టాడు. ఇప్పుడు పాపిస్తాన్ తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయింది.
'ఆపరేషన్ సిందూర్' విజయం వార్తలను తక్కువ చేసి చూపడానికి భారత విమానాలకు కూలచేశామని, సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని తప్పుడు వీడియోలు ప్రచారంలోకి పెట్టింది. ఇది నిజమని నమ్మిన మన దేశానికి చెందిన కొన్ని పత్రికలు వెంటనే షేర్ చేశారు. భారత సమాచార శాఖ ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చడంతో నాలిక కరుచుకున్నాయి.
పాపిస్తాన్ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో 1965లోనే పీహెచ్‌డీ చేసింది. నాటి యుద్దంలో భారత సైన్యం శత్రుదేశం సేనలను చిత్తుగా ఓడించి ముందుకు దూసుకెళుతుంటే అందు విరుద్దమైన వార్తలు కొన్న అంతర్జాతీయ పత్రికల్లో వచ్చాయి. అవి చూసినవారు వారు పాకిస్తానే గెలిచిందని నమ్ముతారు. వాస్తవానికి భారత్ పైచేసి సాధించాక యుద్ధ ఫలితం తేలకుండానే ఆంతర్జాతీయ జోక్యంతో సంధి జరిగింది. అప్పటికే భారత సైన్యం లాహోర్, సియాల్ కోట్ తదితర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నా తిరిగి అప్పగించాల్సి వచ్చింది
ఇప్పటి వరకూ జరిగిన యుద్దాల్లో పాపిస్తాన్ ఏ యుద్దంలోనూ మన దేశంతో గెలవలేదు. ఫేక్ న్యూస్‌లో తప్ప..
నిజం నిద్రలేచే లోపు అబద్దం లోకం చుట్టి వస్తుందటారు.. కానీ వాస్తవానికి నిజం నోరు నొక్కి తప్పుడు వార్తలు ముందుగా వచ్చేస్తున్నాయి.

Comments
Post a Comment