5️⃣ “హీరోలు కోట్లు సంపాదిస్తారు… ప్రాణాలు మాత్రం అభిమానులే కోల్పోతున్నారు! నిజం తెలుసుకో!” #CinemaReality #FanDeaths #SafetyMessage #TeluguYouthAwareness #ChangeStartsNow
సినిమా అంటే ఆనందం… ప్రాణాల పణంగా కాదు! తెలుగు యువతా మేలుకో!
సినిమా మన కోసం పుట్టింది, మనం సినిమాకోసం కాదు. సినిమా థియేటర్ అనేది వినోదం కోసం వెళ్లే స్థలం, మన జీవితాన్ని ప్రమాదంలో పెట్టే రణరంగం కాదు. కానీ గత కొన్నేళ్లుగా సినిమా పేరుతో జరుగుతున్న పిచ్చి అభిమానం… గుంపుల హింస… స్టాంపీడ్‌లు… అసలు వినోదాన్ని వినాశనంగా మార్చేశాయి.
🎥 పుష్ప-2 సంఘటన: ఒక తల్లి ప్రాణాలు… ఒక బిడ్డ ట్రామా
2024 డిసెంబర్ 4. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం సుధా 70MM వద్ద భారీ రద్దీ.
హీరో అల్లు అర్జున్ వచ్చిన వెంటనే జనసంద్రం అదుపులో లేకుండా ఉప్పొంగింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు… నిమిషాల్లో గందరగోళం.
ఫలితం?
- 9 ఏళ్ల బిడ్డతో వచ్చిన రేవతి అనే తల్లి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
- చిన్న బాబు ICUలో… ఇప్పటికీ మాట్లాడలేక భయంతో వణికుతున్నాడు.
ఇది ఆనందమా? లేక దుర్ఘటనా?
⚠️ గేమ్ ఛేంజర్ ఈవెంట్ – రెండు మృతులు
2025 జనవరి.
ఈవెంట్ పూర్తయ్యాక ఇద్దరు యువకులు – అరవ మణికాంత & తోకడ చరణ్ – బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.
తల్లిదండ్రులు ప్రేమతో పెంచిన పిల్లలు…
హీరో కోసం పెట్టిన ఈవెంట్ పేరుతో ఇలా చనిపోవడానికేనా?
⚠️ OG సెలబ్రేషన్స్ – మరో ఫ్యాన్ మరణం
2025 సెప్టెంబర్.
పవన్ కళ్యాణ్ అభిమానిలో ఒకరు ఉత్సాహంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఒక కుటుంబానికి ఆ ఒక్క బిడ్డే అయినా… ఆ ఇంటికి నింపలేని శోకం.
📌 గత పది సంవత్సరాల్లో అధికారికంగా 25+ మరణాలు
వార్తల్లో వచ్చినవి మాత్రమే 25+
వార్తల్లో రాని మరణాలు… గాయాలు… కుటుంబాల కన్నీళ్లు… వందల్లో ఉంటాయి.
ఒకే కామన్ పాయింట్:
హీరోల కోసం పిచ్చి… కానీ ప్రమాదాలపై అవగాహన లేకపోవడం.
😢 నేను అనుభవించిన చేదు అనుభవం
నేను కూడా యంగ్‌లో యోగి–ప్రభాస్ సినిమా కోసం వెళ్లి తోపులాటలో పడిపోయాను.
- చొక్కా చినిగింది
- చేతిలోని మొబైల్ పోయింది
- డబ్బులు పడిపోయాయి
- చివరకు సినిమా కూడా చూడలేదు
ఛీ అనిపించింది.
ఎవరో ఒక హీరో సినిమా కోసం నేను ఎందుకు దెబ్బలు తినాలి అని నాకు అప్పుడు అర్థమైంది.
ఆ రోజు నుంచి 7 సంవత్సరాలు సినిమా చూడలేదు.
2013 తర్వాతనే ఆన్‌లైన్‌లో బుక్ చేసి, హడావిడీ లేకుండా చూసేవాడిని.
🛑 అభిమానమే కానీ… ప్రాణాల మీద కాదు
హీరోలు మన మరణం చూసి బాధపడతారు.
ట్వీట్లు చేస్తారు… కొందరు సహాయం చేస్తారు… ముగిసిపోతుంది.
కానీ…
నీ తల్లి కన్నీళ్లను వారు తుడవలేరు.
నీ స్థానాన్ని ఇంట్లో ఎవరూ భర్తీ చేయలేరు.
నీ నవ్వు… నీ ఉనికి… నీ కుటుంబానికి తిరిగి రాదు.
అలాంటప్పుడు ఒక సినిమా కోసం నీ ప్రాణం పెట్టడం ఏమిటి తెలివి?
🎟️ FDFS చూడకపోతే సినిమా రంగం కూలిపోదు!
BookMyShow, Paytmలో టికెట్లు మన చేతిలోనే ఉన్నాయి.
వీక్‌లో ఎప్పుడు సేఫ్‌గా, కుటుంబంతో వెళ్లి చూడొచ్చు.
లైన్లలో తోపులాట అవసరం లేదు.
💡 ఇండస్ట్రీ మాట: సేఫ్టీ ఫస్ట్ — కానీ అమలు మన చేతిలోనే
హీరోలు, ప్రొడ్యూసర్లు, మంత్రులతో మీటింగులు పెడతారు.
కానీ crowdsను నియంత్రించేది ఎవరు?
మనమే.
మనమే మారాలి.
💰 ఈవెంట్‌ల పేరుతో కోట్ల ఖర్చు… లాభం మాత్రం ఇండస్ట్రీకే
నిన్న రాజమౌళి గారు టైటిల్ కోసం చేసిన ఈవెంట్‌కు కోట్ల ఖర్చు.
సినిమా బావుంటే కాంతారాలా ప్రమోషన్ లేకపోయినా హిట్ అవుతుంది.
కానీ ఈవెంట్ ఖర్చు?
మళ్లీ మన టికెట్ల ద్వారానే వసూలు చేస్తారు.
📢 నా విజ్ఞప్తి – తెలుగు యువతకు
- ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి
- కుటుంబంతో సేఫ్‌గా సినిమా చూడండి
- హీరోలను అభిమానించండి, కానీ దేవుళ్లలా పూజించడం మానండి
- మీ ప్రాణం విలువైనది
- సినిమా చూసే ఆనందం మరణంలో ముగియకూడదు
నీ నిర్ణయం… నీ జీవితం… నీ కుటుంబ భవిష్యత్తు.
🙏 చివరి మాట
సినిమా మనల్ని వినోదపరచాలి.
మనలను చంపకూడదు.
తెలుగు ప్రేక్షకుడా, మేలుకో!
మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి.
ఈ వ్యాసం అవసరం ఉన్న వారికి షేర్ చేయండి.

Comments
Post a Comment