రైతులకు మోదీ హామీ: ప్రకృతి వ్యవసాయంలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా చేసే ప్రణాళిక
ప్రకృతి వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి హబ్‌గా మారబోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇది భారత్‌కు స్వదేశీ, సహజ, శతాబ్దాల నాటి వ్యవసాయ పద్ధతి అని మోదీ గుర్తుచేశారు. క్రమంగా ప్రతి రైతు ఏటా ఒక ఎకరం చొప్పున సహజ వ్యవసాయ పద్ధతికి మారాలని ఆయన పిలుపునిచ్చారు.
తమిళనాడులోని కోయంబత్తూరు పర్యటనలో భాగంగా మోదీ “దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం – 2025” ను ప్రారంభించారు. ఆ సందర్భంగా పీఎం–కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. యువత వ్యవసాయాన్ని ఆధునిక, భవిష్యత్ అవకాశాలతో ఉన్న రంగంగా చూస్తుండటం దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు శక్తినిస్తోంది అని మోదీ పేర్కొన్నారు.
🌱 రసాయన ఎరువుల ప్రభావం – రైతులపై పెరుగుతున్న భారం
రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం నేల సారాన్ని తగ్గిస్తోందని, నేల తేమను దెబ్బతీస్తోందని మరియు వ్యవసాయ ఖర్చులను పెంచుతోందని మోదీ తెలిపారు.
ఈ సమస్యకు సహజ పరిష్కారం ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ, పంట మార్పిడి అని ఆయన స్పష్టం చేశారు.
మిల్లెట్స్ “సూపర్ ఫుడ్” అని అభివర్ణిస్తూ, రైతులు వాటి సాగుపై దృష్టిపెట్టాలని మోదీ సూచించారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
🌍 ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా భారత్
వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెండింతలయ్యాయని, ఆధునిక వ్యవసాయానికి అనుగుణంగా పెద్ద పెట్టుబడులు వస్తున్నాయని మోదీ తెలిపారు.
భవిష్యత్‌లో భారత్ ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ హబ్‌గా ఎదుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
“మన జీవవైవిధ్యం కొత్త దిశలో ప్రయాణిస్తోంది. యువత వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ రంగంగా చూస్తున్నారు. ఇదే గ్రామీణ సమృద్ధికి పునాది కావడం ఖాయం” అని మోదీ పేర్కొన్నారు.
🌾 తమిళనాడు రైతులకు మోదీ ప్రశంసలు
దక్షిణ భారత సహజ వ్యవసాయ సమ్మిట్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు తమిళనాడు రైతులకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పిహెచ్‌డీ చేసిన వారు, మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు, నాసా ఉద్యోగులు కూడా వ్యవసాయాన్ని ఎంచుకోవడం భారత్ వ్యవసాయ రంగంలో జరుగుతున్న భారీ మార్పులకు నిదర్శనమని మోదీ అభిప్రాయపడ్డారు.
సదస్సులో రైతులు తయారు చేసిన ఉత్పత్తులు, పంటలను పరిశీలించిన మోదీ, సహజ వ్యవసాయ విధానాలపై వారికి ప్రశ్నలు అడిగి అభినందనలు తెలియజేశారు.
#NaturalFarming #BharatAgri #PMModi #IndianAgriculture #OrganicFarming #SustainableFarming #Kisan #PMKisan #TamilNadu #Coimbatore #AgricultureNews #FarmersFirst #VishwaguruIndia #PrjaVibe #KeshaboinaSridhar #IndiaFutureReady
Comments
Post a Comment