పన్ను ఎగవేత ఆరోపణలు మధ్య అన్నపూర్ణ స్టూడియోలో భట్టి విక్రమార్క సందర్శన

హైదరాబాద్‌లోని ప్రముఖ సినిమా సముదాయం అన్నపూర్ణ స్టూడియో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు GHMC నుంచి పన్ను ఎగవేత ఆరోపణలపై నోటీసులు జారీ కాగా… మరోవైపు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫిల్మ్ స్కూల్‌ను సందర్శించడం చర్చనీయాంశమైంది.



GHMC నోటీసులు ఎందుకు?



GHMC అధికారుల ప్రకారం, అన్నపూర్ణ స్టూడియో ట్రేడ్ లైసెన్స్ రిన్యూవల్ సమయంలో వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి భారీగా పన్ను ఎగవేత చేసినట్లు గుర్తించారని తెలిపింది.

దీంతో స్టూడియోకు అధికారికంగా నోటీసులు పంపి వివరణ కోరింది.


ప్రస్తుతం ఈ అంశం GHMC–అన్నపూర్ణ స్టూడియో మధ్య వివాదంగా మారింది.



భట్టి విక్రమార్క స్టూడియో సందర్శన



అయితే ఇదే రోజు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌ను పర్యటించడం రాజకీయంగా, సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.


పర్యటనలో ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి ఫిల్మ్ మేకింగ్ ప్రాజెక్ట్స్‌ను పరిశీలించారు.

సినీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని భట్టి అన్నారు.



రెండు సంఘటనలు – ఒక్కరోజు



ఒకవైపు పన్ను ఎగవేత ఆరోపణలు… మరోవైపు ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధి సందర్శన…

ఈ రెండు సంఘటనలు ఒకే రోజు జరగడంతో అన్నపూర్ణ స్టూడియో మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది.


తదుపరి GHMC చర్యలు ఎలా ఉండబోతున్నాయి? స్టూడియో వివరణ ఏమిటి? రాజకీయ–సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

#AnnapurnaStudios #GHMC #BhattiVikramarka #Nagarjuna #HyderabadNews 

#Tollywood #FilmIndustry #TradeLicenseIssue #BreakingNews 

#TelanganaPolitics #PrjaVibe #KeshaboinaSridhar

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!