• “శివాజ్యోతి వివాదాల వెనక అసలేం జరిగింది? పూర్తి కథ”
తీన్మార్ సావిత్రి (శివాజ్యోతి) అసలు జీవిత కథ: వి6 రోజులు నుండి తిరుమల ప్రసాదం వివాదం వరకు – బయటపడిన నిజాలు
తీన్మార్ సావిత్రి అని పేరు చెప్పగానే తెలంగాణ వాళ్ళకు వెంటనే గుర్తొచ్చే ముఖం — అసలు పేరు శివాజ్యోతి.
ఇటీవల ఆమె చేసిన తిరుమల ప్రసాదంపై కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీటీడీ బోర్డుకు ఫిర్యాదులు పంపించారు.
కానీ… ఈ వివాదం వెనక ఉన్న ఆమె నిజ జీవిత కథ చాలా మందికి తెలియదు.
ఈ పోస్ట్‌లో ఆమె చిన్ననాటి జీవితం నుండి ప్రేమ, పెళ్లి, వి6, బిగ్ బాస్, వివాదాలు, ఇప్పటి తిరుమల ఇష్యూ వరకు — తెలియని నిజాలు మీకోసం.
🌟 శివాజ్యోతి ఎవరు? – చిన్ననాటి నుండి ప్రేమ జెర్నీ వరకు
1989లో నిజామాబాద్ జిల్లా – ముక్కల్ మండలం నాగంపేట లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.
తండ్రి RMP డాక్టర్, తల్లి బీడీలు చుడుతూ కుటుంబం నడిపేవారు.
కూతుర్ని డాక్టర్ చేయాలని నర్సింగ్‌లో చేర్పించారు…
కానీ పిల్లలకు సూది వేయడం నచ్చక, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది.
ఇప్పుడే పక్క ఊరిలో ఉన్న రోమ పుష్టి కలిగిన గంగూలీ అనే వ్యక్తితో ప్రేమలో పడింది.
ఇద్దరూ రోజంతా తిరుగుతుండటంతో పంచాయతి పెట్టి వార్నింగ్ ఇచ్చారు.
నిరాశలో శివాజ్యోతి నిద్ర మాత్రలు మింగినా, చికిత్స చేసి కాపాడారు.
తర్వాత గంగూలీ హైదరాబాద్‌లో B.Tech చేస్తుండగా,
శివాజ్యోతి కూడా చదువుల పేరిట హైదరాబాద్‌కు వెళ్లింది.
ఇంట్లో వాళ్లు వార్నింగ్ ఇవ్వడంతో,
“అతనే చేసుకుంటా… అతన్ని తప్ప ఇంకెవరూ వద్దు” అని ఛాలెంజ్ వేసింది.
అంతగా విసిగిపోయిన గంగూలీ కుటుంబం చివరకు ఆమెతో తెగతెంపులు చేసుకుంది.
కానీ ప్రేమ మాత్రం మిగిలిపోయింది.
💍 చివరకు పెళ్లి — 2015
గంగూలీ చదువు పూర్తి అయ్యి, జాబ్ వచ్చాక,
2015లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరి బంధం అప్పట్లో బలంగానే కనిపించింది.
📺 మీడియా కెరీర్ – V6 నుంచి బిగ్ బాస్ వరకు
యాంకర్ అవ్వాలని ప్రయత్నిస్తే,
కొన్ని చోట్ల “నీ గొంతు బాగోలేదు” అంటూ ఎగతాళి చేశారు.
తర్వాత V6 ఛానెల్‌లో సెలెక్ట్ అయ్యింది.
తీన్మార్ వార్తలు ఆమెకే హైలైట్ అయ్యాయి.
ఆమె Telangana slang, డ్రెస్ స్టైల్, కట్టు బొట్టు ప్రజల్లో పాపులర్ అయ్యాయి.
బిత్తిరి సత్తి – సావిత్రి కాంబినేషన్ హిట్ అయ్యింది.
ఆదాయం చాలా ఎక్కువ కాకపోవడంతో
తర్వాత TV9 లో చేరింది.
ఇందులో భాగంగా బిగ్ బాస్ లో పాల్గొని
ఎక్కువ ఎమోషనల్ అవుతూ
“పాతాళ గంగ” ట్యాగ్ సంపాదించుకుంది.
టాప్ 6లో నిలిచింది.
🌍 ఇమేజ్ మార్పు – ఆధునిక స్టైల్ & వ్లాగ్స్
బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి స్టైల్ పూర్తిగా మారింది.
సాంప్రదాయం నుండి మోడ్రన్ స్టైల్ కి మారి
ఫోటోషూట్లు, ఈవెంట్లు, విదేశీ వ్లాగ్స్ చేస్తూ వచ్చింది.
స్నానం చేస్తూ, నురుగుతో వీడియోలు పోస్ట్ చేయడంతో
నెగటివ్ కామెంట్లు ఎక్కువయ్యాయి.
🤰 12 ఏళ్ల పెళ్లి తర్వాత… ఇప్పుడు గర్భవతి ఎలా?
ఇది చాలా మంది అడిగిన ప్రశ్న.
కారణం —
శివాజ్యోతి IVF ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
తాను మోడల్‌గా పనిచేసే IVF సెంటర్‌లోనే చికిత్స పొంది
ఇప్పుడు గర్భవతిగా ఉంది.
🔥 తాజాగా తిరుమల ప్రసాదం వివాదం
ఇటీవల,
తన భర్త మరియు అతని తమ్ముడితో కలిసి
తిరుమలకు వెళ్లింది.
అక్కడ ప్రసాదం తీసుకుంటూ
“కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం” లాంటి అవమానకర వ్యాఖ్యలు చేస్తూ
వీడియో పోస్ట్ చేసింది.
ఆ వీడియో వైరల్ అయ్యింది.
భక్తులు మండిపడి
TTD అధికారులకు ట్యాగ్ చేస్తూ
ఈమె మీద చర్యలు తీసుకోమని కోరుతున్నారు.
ఇప్పడు ప్రశ్న:
TTD ఆమెపై చర్యలు తీసుకుంటుందా?
అది పూర్తిగా బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
🤔 మీ అభిప్రాయం ఏమిటి?
– శివాజ్యోతి తప్పు చేసిందా?
– సోషల్ మీడియా ఓవరాక్షన్ చేస్తున్నదా?
– లేక ప్రసంగ స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకున్నారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.
పోస్ట్ నచ్చితే Like, Share & Follow చేయండి.
#Shivajyothi #TeenmaarSavitri #TirumalaControversy #TTD #TeluguNews #InterestingFacts #UnknownFacts #BiggBossTelugu #V6News #TV9 #IVFJourney #CelebrityLife #TollywoodNews #SridharBlog #PrajaVibe
Adoka pedda waste moham di
ReplyDelete