ఐబొమ్మ, బొమ్మ… అసలు సమస్య ఎవరిది? సినిమా పరిశ్రమ ఆత్మవిమర్శ చేయాల్సిన సమయం!

ఐబొమ్మను నిషేధిస్తే సమస్యలు అన్నీ పూర్తవుతాయా? అసలు కాదు!

టెక్నాలజీని అడ్డుకోవడం అసాధ్యం. ఒకదాన్ని బ్యాన్ చేస్తే… దాన్ని మించిన మరో బామ్మ, మరో వేదిక పుట్టుకొస్తుంది.

అందుకే నిషేధం కాదు—సమస్య మూలాన్ని అర్థం చేసుకోవాలి.


ఐబొమ్మను సమర్థించే అవసరం లేదు. రవి చేసిన పని నేరమే.

అయినా… ఎందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అతనిపై సానుభూతి చూపుతున్నారు?

ఒక్కసారి ఆలోచించాలి.


సినిమా పరిశ్రమ పెద్దలు, తనకు నష్టం జరిగిందని రవిని ఉరి తీయాలని అంటున్నారు.

కానీ ప్రశ్న ఏమిటంటే…

వీరివల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా?


వినోదం రోజురోజుకూ చౌకగా మారుతోంది.

డిజిటల్ ప్రపంచంలో ప్రేక్షకుడు తక్కువ ఖర్చుతోనే వినోదాన్ని కోరుకుంటున్నాడు.

అలాంటి సమయంలో…

సినిమాలు మాత్రం విపరీతమైన బడ్జెట్లు, వందల కోట్ల పారితోషికాలు, ఇమేజ్‌ల కోసం దోపిడీలతో కొనసాగుతున్నాయి.


ఇతర భాషా సినిమాలతో పోలిస్తే తెలుగు చిత్రాల వ్యయం ఎందుకు అంత ఎక్కువ?

మనవాళ్లు అంత బలమైన కథలతో తీస్తున్నారా?

ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా…

మూస కథలు, అరువు కథలు, అదే ఫైట్లు, అదే పాటలు—పాతిపడుతున్న కంటెంట్.


ప్రేక్షకుల జేబుల్లోంచి వందల రూపాయల టికెట్ ధరలు వసూలు చేయడం సిగ్గు కాదు?

సినిమాలు చూస్తేది పేద, మధ్య తరగతి ప్రజలే.

వారికి ఇప్పటికే థియేటర్లలో స్నాక్స్ ధరల దోపిడీ ఉంది.

దీనికి తోడు భారీ టికెట్ ధరల దెబ్బ!


ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుందాం—

సీడీ, డీవీడీ శకం చివరి దశలో రూ.100–200 టికెట్ ఉన్న సినిమాలు ₹25–50కి పడిపోయాయి.

ఫోన్ కాల్ ₹1.25 ఉండేది—ఇప్పుడు ఇంటర్నెట్‌తో కలిపి ఉచితంగా అపరిమిత కాల్స్ చేస్తున్నాం.

డేటా ధరకూడా అపరిమితంగా తగ్గింది.


కానీ సినిమా నిర్మాణ వ్యయం మాత్రం… ఆకాశాన్ని అంటుతోంది!


ఇప్పటికైనా మారండి.

బడ్జెట్లు తగ్గించండి.

ప్రేక్షకుడికి అందుబాటు ధరలో వినోదం అందించండి.


లేకపోతే…

ఐబొమ్మను మించిన బామ్మ వస్తుంది.

మీరు ఊహించని పరిమాణంలో మరో పెద్ద “బొమ్మ” మీ పరిశ్రమకు ముప్పు తీసుకొస్తుంది! 


 #TeluguCinema #Ibomma #TollywoodIssues #CinemaIndustry #MoviePiracy #TollywoodBudget #AudienceVoice 

#KeshaboinaSridhar #PublicOpinion #FilmIndustryReform #MovieTicketPrices #TeluguMovies #DigitalEra

#SupportGoodCinema #CineUpdates #IndustryAnalysis #TrendingNow #ViralNews #CinemaDebate


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!