🔶 కరీంనగర్‌లో బీజేపీ ఘన విజయ యుగం: తొలి దశలోనే 40+ స్థానాలతో కమలం దూకుడు!

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈసారి తన అసలైన బలం ఏమిటో చాటిచెప్పింది. గత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 800కు పైబడి గ్రామ పంచాయతీల్లో పోటీ చేసినా, బీజేపీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది.


కేంద్ర హోం శాఖ సహాయక మంత్రివర్యులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్‌గారి వ్యూహాత్మక నేతృత్వంలో తొలి దశలోనే 40కుపైగా స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. మొత్తం 160 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో నాలుగోవంతుకిపైగా విజయం సాధించడం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.


అంతే కాకుండా మొదటి దశలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో 10 మంది ఇప్పటికే బండి సంజయ్ సమక్షంలో బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవడం మరో ముఖ్యాంశం. కేంద్ర నిధులు, ఎంపీ లాడ్స్, సిఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో వారు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడమే గ్రామాల్లో అభివృద్ధి పనులు దెబ్బతినడానికి కారణమని ఇండిపెండెంట్ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంతో బండి సంజయ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నందున అభివృద్ధి నిధులు మరింతగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు విశ్వసిస్తున్నారు.


ఎన్నికలు పార్టీ గుర్తుల్లేకుండా జరిగితేనూ, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థితో బండి సంజయ్ నిరంతరం టచ్‌లో ఉంటూ, వారికి అవసరమైన సమాచారాన్ని, సహకారాన్ని చేరవేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పోల్ మేనేజ్మెంట్‌పై సూచనలు ఇవ్వడం, చివరి నిమిషం వరకు పరిస్థితిని పర్యవేక్షించడం ఈ విజయానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.


మొదట 30 స్థానాలు వస్తాయని అంచనా వేసిన బీజేపీకి 40కి పైగా స్థానాలు రావడం శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. ఇక 2వ మరియు 3వ దశల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను మించిపోయే లక్ష్యంతో బండి సంజయ్ ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేశారు. కరీంనగర్‌లో కమలం మరింత వికసించేందుకు ఇది మంచి శుభారంభం అని చెప్పాలి.



#కరీంనగర్ #BJP #BandiSanjayKumar #Kari mnagarBJP #BJPVictory

#PanchayatElections #TelanganaBJP #ModiGovt #Development #BJPGrowth

#GrassrootPolitics #Kari mnagarPolitics #BJPWinningStreak

#VoiceOfThePeople #KeshaboinaSridhar

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!